చాణక్యనీతి : ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ ఐదు నేర్చుకోకుండా చూడాలి..లేకపోతే?
09 September 2025
Samatha
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు. ఎన్నో విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
చాణక్యుడు ఎన్నో విషయాల గురించి నేటి తరం వారికి తెలిపిన విషయం తెలిసిందే. అలాగే పిల్లల పెంపకంపై కూడా తల్లి దండ్రులకు కొన
్ని సూచనలు చేశారు.
ఏ తల్లి దండ్రులైనా సరే తమ పిల్లలకు ఐదు చెడు అలవాట్లు మాత్రం అస్సలే నేర్పకూడదు, వారు నేర్చుకోకుండా చూడాలి అని తెలియజేయడం జరిగింది.
పిల్లలు ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా తల్లిదండ్రులు చూడాలి. తర్వాత ఈ అలవాటు వారి స్వభావంలో భాగమై కెరీర్ పై చెడు ప్రభావం చూపుతుందంట.
అలాగే చాణక్యుడి ప్రకారం ప్రతి పేరెంట్స్ తమ పిల్లలను సోమరులను చేయకూడదు, దీని వలన వారు ఎప్పటికీ జీవితంలో విజయం సాధించలేరని తెలిపా
రు.
అదే విధంగా తప్పుడు సవాసం ఎప్పటికైనా ముప్పే, అందుకే పిల్లల స్నేహితుల స్వభావం, చూడాలి. వారి స్నేహితులు తప్పుడు వారు అవుతే మీ పిల్లల
జీవితం పాడవుతుందంట.
అంతే కాకుండా పిల్లలను ఇతరులను ఎగతాలి చేసేలా, అవమానించేలా అస్సలే పెంచకూడదంట. ఇది వారి బంధాలను బలహీనంగా మారుస్తుందంట.
అలాగే సమయం చాలా గొప్పది. అందుకే ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలకు సమయం విలువ తెలియజేయాలని చాణక్యుడు సూచించడం జరిగింద
ి.
మరిన్ని వెబ్ స్టోరీస్
బట్టతల ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ వార్త తెలిస్తే ఎగిరి గంతేస్తారు అంతే!
మిరియాలు చేసే మేలు తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం!
డేంజర్ : ఖాళీ కడుపుతో పాలు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!