చాణక్య నీతి .. ఈ విషయాల్లో డబ్బు ఖర్చు చేస్తే అప్పుల బాధలే

Samatha

27 August 2026

ఆచార్య చాణక్యుడు తన కాలంలోనే అత్యంత ఙానవంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

అంతే కాకుండా ఆయన గొప్ప పండితుడు. అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని కూడా రచించారు.

దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేడం జరిగింది. అవి ఋ తరం వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

అదే విధంగా చాణక్యుడు బంధాలు , బంధుత్వాలు మాత్రమే కాకుండా డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి. ఏ విషయంలో డబ్బు ఖర్చు పెట్టడం మంచిది కాదో కూడా తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఎప్పుడూ కూడా ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు పెట్టకూడదంట. అలా చేయడం వలన అప్పుల పాలు అవుతారు.

కొన్ని బంధాలు పనికి రానివి అని అర్థం అవుతాయి. అయినా కూడా కొంత మంది వారికి డబ్బు ఖర్చు చేస్తారు. కానీ అలా చేయకూడదంట.

అదే విధంగా ఇతరుల నుంచి తాత్కాలిక ప్రశంసలు అందుకోవడం కోసం , గౌరవం కోసం ఎప్పుడూ కూడా డబ్బు ఖర్చు చేయకూడదు అని తెలిపాడు.

అంతే కాకుండా కొందరు గొప్పలు చూపెట్టుకోవడానికి నలుగురిలో హుందాగా ఉండటానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అది కూడా మంచిది కాదంట.