చాణక్య నీతి : మైండ్ గేమ్ ఆడటం ఎలా నేర్చుకోవాలో తెలుసా?

samatha

9  November 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడు గొప్ప  పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు  ఈ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మైండ్ గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియజేశాడు.

ప్రపంచంలో ఎదుర్యే సవాళ్లు

జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి చాణక్య నీతి ఒక విలువైన మార్గదర్శకం.

తెలివైన నిర్ణయాలు

 ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకుండా, వారి ప్రవర్తనను గమనించడం, అలాగే మన భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎంతో ముఖ్యం అని చాణక్యుడు చెబుతున్నాడు.

ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మ కూడదు

మైండ్ గేమ్స్ అంటే ఇతరులను మోసం చేయడం కాదు. మన చుట్టూ జరిగే విషయాలను నిశితంగా గమనించడం, ప్రతి మాటకు వెంటనే స్పందించకుండా ఉండటం, మన పరిమితులను అర్థం చేసుకోవడం. 

మైండ్ గేమ్స్ ఆడటం

 చదరంగం ఆటగాడిలా భవిష్యత్తు పరిణామాలను అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆవేశపూరిత తప్పులు చేయకుండా ఉండొచ్చు.

ఆవేశ పూరితమైన తప్పులు

పొగడ్తలకు, విమర్శలకు వెంటనే లొంగిపోకుండా, వాస్తవాలను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. కోపం వచ్చినప్పుడు తొందరపడి మాట్లాడకుండా, ప్రశాంతంగా ఆలోచించి స్పందించడం వివేకవంతమైన చర్య.

పొగడ్తలకు లొంగకూడదు

మన పనికి గుర్తింపు పొందేలా చేసుకోవడం, అవసరం లేని సవాళ్లను తిరస్కరించడం, ఇతరులతో పోల్చుకోవడం మానుకోవడం వంటి సూత్రాలు వ్యక్తిగత జీవితంలో స్థిరత్వాన్ని పెంపొందిస్తాయి. 

పనికి గుర్తింపు పొందడం