నవరాత్రి ఉపవాసం... కాఫీ, టీలు తాగొచ్చా? తెలుసుకుందాం!

19 September 2025

Samatha

నవరాత్రి ఉత్సవాలు ప్రారభం కాబోతున్నాయి. 2025వ సంవత్సరంలో నవరాత్రి సెలబ్రేషన్స్ 22 సెప్టెంబర్ నుంచి మొదలు అవుతాయి.

ఈ క్రమంలో భక్తులందరూ తొమ్మిది రోజుల పాటు నిష్టగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, భక్తి శ్రధ్ధలతో ఉపవాసం ఉంటూ, అమ్మవారిని పూజిస్తుంటారు.

ఇక నవరాత్రుల ఉపవాసం అంటే , ఆహారం మానేయ్యడమే కాకుండా, మనసు, శరీరాన్ని కూడా శుద్ధి చేసుకొని, అమ్మవారినే స్మరిస్తూ పూజ చేయడం.

ఈ నవరాత్రుల ఉత్సవాల సమయంలో ధాన్యాలు, ఉల్లి, వెల్లుల్లిచ వంటి వాటికి దూరం ఉంటూ అల్పాహారం మాత్రమే తీసుకుంటారు.

మరి ఈ ఉపవాసాల  సమయంలో చాలా మందిలో మెదిలే ప్రశ్న, టీ, కాఫీలు తాగవచ్చా? లేదా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

నవరాత్రుల సమయంలో సాధ్యమైనంత వరకు కాఫీ, టీలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే?

టీ, కాఫీలు తాగడం వలన శరీరాం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. అందుకే వీటికి దూరం ఉండాలంట.

ఉపవాసం అంటే? ఆహారం తీసుకోకపోవడం, అయితే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన నిద్రలేమి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయంట.

అందుకే నవరాత్రుల సమయంలో టీ , కాఫీలకు బదులుగా, చక్కెర, పాలు లేకుండా బ్లాక్ టీ తాగడం శ్రేయస్కరం అంట.