భగవద్గీత బోధనలు.. నీ ఆలోచనే నీ జీవితాన్ని మారుస్తుంది..

samatha

6 November 2026

Pic credit - Pinterest

భగవద్గీత బోధనలు చాలా అద్భతంగా ఉంటాయి. చదివినా , విన్నా ఏదో తెలియని కొత్త ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

భగవద్గీత బోధనలు

 ఇప్పుడు మనం భగవద్గీతలో శ్రీ కృష్ణుడు జీవితం మారడం గురించి చాలా గొప్పగా తెలియజేశాడు. దాని  గురించి తెలుసుకుందాం.

జీవితం మారడం

భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి ఆలోచనే అతని జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది ఇప్పుడు మనం  వివరంగా తెలుసుకుందా పదండి.

వ్యక్తి ఆలోచన

ఒకే కష్టం ఇద్దరు వ్యక్తులకు వచ్చినప్పుడు, ఒకరు విజయం సాధించి మరొకరు ఎందుకు విఫలమవుతారు? దీనికి కారణం అదృష్టమా? కాదు ఆలోచన విధానమే అంటున్నారు శ్రీకృష్ణుడు.

అదృష్టం, ఆలోచన

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే, మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. "ఉద్ధరేదాత్మనాత్మానం న ఆత్మానం అవసాదయేత్" .

 మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి

 ఆ సూత్రం ప్రకారం ఒక వ్యక్తి తన ఆలోచనల ద్వారానే, తన జీవితాన్ని మెరుగు పరుచుకోవాలని శ్రీకృష్ణుడు తెలియజేయడం జరిగింది.

శ్రీకృష్ణుడు

ఎప్పుడైనా ఒక వ్యక్తి తనను తాను కిందకు దించుకోకూడదు. ఎప్పుడూ తను పైనే ఉండాలి. ఎదిగే స్థాయిలో నేర్చుకునే స్థాయిలోనే ఉండాలి.

గొప్పస్థాయి

ఎందుకంటే నీకు నువ్వే మంచి స్నేహితుడివి, అలాగే నీకు నువ్వే పెద్ద శత్రువువి. నిన్ను బాగు చేసేది, నాశనం చేసేది బయట ఎక్కడా లేదు, నీ మనసులోనే ఉందని కృష్ణుడు స్పష్టం చేశాడు

అన్నింటికీ నువ్వే