'హీరో స్ప్లెండర్ ప్లస్' అసాధారణమైన ఇంధన సామర్థ్యం కలిగిన బెస్ట్ సెల్లర్ బైక్. ఇది ధర ₹73,902 నుంచే లభిస్తుంది.
'హీరో HF డీలక్స్' ఇంధన సామర్థ్యం, కలిగిన సెన్సిబుల్ కమ్యూటర్ మోటార్ సైకిల్. దీని ధర ₹59,998 - ₹71,268 మధ్య ఉంటుంది.
'హోండా షైన్ 125' కూడా మంచి బైక్. ఇది 125cc ఇంజిన్‌తో ఇంధన సామర్థ్యంతో ప్రసిద్ధి చెందింది, దీని ధర ₹85,590 నుంచి ₹90,341 మధ్య ఉంటుంది.
మీకు బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ కావాలనుకుంటే మాత్రం 'TVS Raider 125' తీసుకోండి. దీని ధర ₹1,15,000 నుంచి మొదలవుతుంది.
'TVS Apache RTR 160' అనేది మంచి పనితీరు, పదునైన స్టైలింగ్, సున్నితమైన రైడింగ్ అనుభవం కలిగిన స్పోర్టీ బైక్. దీని ధర ₹1,21,420 నుంచి ప్రారంభమవుతుంది.
'బజాజ్ పల్సర్ NS200' స్పోర్టీ లుక్స్, బలమైన త్వరణం, అద్భుతమైన హ్యాండ్లింగ్ కలిగిన స్టేబుల్ మోటార్ సైకిల్. దీని ధర ₹1,43,213 దగ్గర మొదలవుతుంది.
'యమహా MT 15 V2' స్పోర్టీ లుక్స్, అద్భుతమైన మైలేజ్ కలిగిన బైక్. ఇది యువ రైడర్ల అగ్ర ఎంపిక. దీని ధర ₹1,69,550 వద్ద స్టార్ట్ అవుతుంది.
మీకు హైఎండ్ లో కావాలంటే 'రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350' తీసుకోవచ్చు. ఐకానిక్ డిజైన్, శక్తివంతమైన పనితీరుకు పేరుగాంచింది. ఈ బైక్ ధర ₹1,97,253 నుంచి ప్రారంభమవుతుంది.