క్యారెట్‌ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్‎లో ఉంటే.. నో వర్రీస్.. 

22 September 2025

Prudvi Battula 

చాలామందికి క్యారెట్‌ అంటే ఇష్టంగా ఉంటుంది. కొందరైతే దీన్ని పచ్చిగానే తేనేస్తారు. మరికొందరు దీంతో హల్వా చేసుకుంటారు.

క్యారెట్‌తో ఎలాంటి వంటకం చేసిన చాల టేస్టీగా అందరికి నచ్చేలా ఉంటుంది. రోజూ ఒక పచ్చి క్యారెట్ తింటే డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన పని ఉండదు.

దీనిలో కెరోటీనాయిడ్స్, బీటా కెరోటిన్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు అన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

ఇందులో ఉన్న శక్తివంతమైన ఫాల్కారినోల్ కాంపౌండ్ ఉన్నందున ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యారెట్లను పచ్చిగా తింటే క్యాన్సర్ ప్రమాదం దూరం చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పురోగతికి విరుగుడుగా పని చేస్తాయి.

రోజూ పచ్చి క్యారెట్ తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనిలోని ప్రోటీన్ అధిక కొవ్వును సులభంగా కరిగిస్తుంది.

ఆహారం ఎక్కువ తీసుకొనేవారు భోజనానికి ముందు క్యారెట్ తినడం మంచిది. ఇది పేగులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇందులో పుష్కలంగా లభించే పొటాషియం రక్తపోటు సమస్య ఉన్నవారికి మంచిది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.