అప్పు తీర్చిన అయోధ్యరాముడు.. ఎన్నికోట్లో తెలుసా?

samatha 

17 march 2025

Credit: Instagram

ఎంతో మంది హిందువుల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం. ఎట్టకేలకు ఆ కళ నెరవేరింది. అయోధ్యలో బాలరాముడిగా ఆ రామయ్య కొలువుదీరాడు.

ఎప్పుడూ అయోధ్య రామ మందిరం కోట్లాది మంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. మరీ ముఖ్యంగా కుంభమేళ సమయంలో ఇక్కడికి ఎంతో మంది భక్తులు వెళ్లి రాముల వారిని దర్శించుకున్నారు.

అంతే కాకుండా రామయ్యకు కానుకల రూపంలో భారీగా విరాలాలు, డబ్బులు వచ్చాయి. దీంతో అయోధ్య ఆదాయం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.

అయితే శ్రీరామ జన్మభూమి క్షేత్రం అయోధ్య రామ మందిరం గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి సుమారుగా రూ.400 కోట్ల పన్ను చెల్లించిందంట.

2020 ఫిబ్రవరి 5 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు ఈ మొత్తాన్ని చెల్లించినట్టు ఆలయ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం తెలియజేయడం జరిగింది.

ఇందులో రూ.270 కోట్లు జీఎస్టీగా, మిగిలిన రూ.130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్టు వివరించారు. గత ఏడాది 5 కోట్ల మంది ఆలయాన్ని సందర్శించారని తెలిపారు.

కలియుగ పురుషుడు శ్రీరాముడు. అయోధ్య నివాసిగా పేరొందిన శ్రీరాముని ఆలయం కట్టించి సుమారు 5ఏళ్లు పూర్తి కావస్తోంది. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న పీఎం మోదీ నాయకత్వంలో జరిగింది.

ఆరోజు నుంచి ఈ  రోజు వరకు ఎంతో మంది భక్తులు రాముల వారిని దర్శించుకుంటున్నారు. రాముల వారిని గత సంవత్సరం అయోధ్యకు 16 కోట్ల దర్శించుకోగా, ఇప్పుడు 5 కోట్ల  సందర్శించారు.