అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఏ పూలతో పూజిస్తే లక్కు కలిసి వస్తుందో తెలుసా?

Samatha

18 April 2026

పూజలో పూలు ఉపయోగించడం సహజం. ప్రతి ఒక్కరూ పూజ చేసే సమయంలో తప్పకుండా పూలను ఉపయోగిస్తుంటారు.

పూజలు

పూలు లేకుండా ఏ పూజను జరపరు చాలా వరకు. అయితే ఏప్రిల్ 19న అక్షయతృతీయ. అయితే ఈరోజు లక్ష్మీదేవిని ఈ పూలతో పూజిస్తే లక్కు కలిసి వస్తుందంట.

అయతృతీయ

అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. అక్షయం అంటే తరిగిపోని, అందువలన ఈ రోజు ఏం చేసినా మంచి ఫలితం లభిస్తుందని అంటారు.

కలసి రావడం

అయితే ఇంత పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ఎర్రని మందారాలు లేదా తామర పూలతో పూజించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందంట.

మందారాలు లేదా తామర పూలు

అదే విధంగా ఈ రోజు విష్ణుమూర్తిని పసుపు రంగుల పూలతో పూజించడం వలన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి.

పసుపు రంగు పూలు

అదే విధంగా ఈ రోజు చాలా మంది లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు. అయితే కుబేరుడిని పసుపు లేదా తెలుపు రంగు పూలతో పూజించడం చాలా మంచిది.

కుభేర పూజ

అలాగే ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. అయితే వినాయకుడిని తెల్లని పూలతో పూజించడం వలన మంచి జరుగుతుందంట.

వినాయకుడి పూజ

అయితే ఈ రోజు పూజ చేసే సమయంలో తాజా పూలను మాత్రమే ఉపయోగించాలి. వాడిపోయినా, రాలిపోయిన పూలను ఉపయోగించకూడదు.

తాజా పూలు