యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీగా ఆదాయం..ఎంత అంటే?

samatha

21 January 2025

 తెలంగాణలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఒకటి. ఈ ఆలయం నల్లగొండ జిల్లాలో ఉంది.

తాజాగా ఈ దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం

 కాగా, హుండీ ఆదాయం భారీగా వచ్చినట్లు తెలుస్తోంది. భక్తులు స్మామివారికి పెద్ద ఎత్తున బంగారం, వెండి కానుకలు కూడా సమర్పించారు.

కాగా, యాదరిగుట్ట లక్ష్మీ నరహింహ స్వామి దేవస్థానం ఆదాయం ఎంత వచ్చిందో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఆలయ ఈఓ భాసర్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవస్థానానికి 48 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఆదాయం రూ. నాలుగు  కోట్ల పదిహేడు లక్షల పదమూడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయల నగదు రూపంలో వచ్చినట్లు అధికారలు తెలిపారు

 అదే విధంగా స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన బంగారం వెండి వివరాల్లోకి వెళితే..228 గ్రాముల బంగారం, 7 కిలోల 50 గ్రాముల వెండి వచ్చిందంట.

అలాగే హుండీ లెక్కింపు‌లో ఫారెన్ కరెన్సీ సైతం బయటపడినట్లు ఆలయ ఈవో తెలిపారు. పెద్ద మొత్తంలోనే ఆలయానికి హుండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.