పేరుకే పెద్దోడు.. జీతంలో మాత్రం వారికంటే చిన్నోడు!
samatha
21 January 2025
Credit: Instagram
47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. ఆయన కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈయన గురించే ముచ్చటిస్తుంది. కాగా, ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు అనగానే ఆయన జీతం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలనే ఆతృత చాలా మందిలో ఉంటుంది.కాగా, అసలు ఆయనకు జీతం ఎంత వస్తుందో తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడికి ప్రతి సంవత్సరం సుమారు 400000 డాలర్స్‌ను జీతంగా ఇస్తారంట. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారురూ. 3.36 కోట్లు.
ఇవే కాకుండా ఇంకా అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. ఇతర సౌకర్యాలు అన్నీ లెక్కలోకి తీసుకుంటే ఆయన జీతం దాదాపు రూ.4.78 కోట్లు ఉంటుందంట.
ఇంతే అనుకుంటున్నారేమో.. అమెరికా అధ్యక్షుడికి ఆ ప్రభుత్వం, అందమైన అమెరికా వైట్ హౌజ్‌లో వసతిని కల్పిస్తుంది.
ఇవే కాకుండా వైట్ హౌజ్ అలంకరణకు కూడా ప్రభుత్వమే సుమారు రూ. 84 లక్షలు అధ్యక్షుడికి అందించడం జరుగుతుందంట.
అదే విధంగా,మెరైన్ వన్ హెలికాప్టర్, ఎయిర్ ఫోర్స్ వన్ పేరుతో కూడిన విమానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందివ్వడం జరుగుతుందని సమాచారం.
ఇదంత పక్కన పెడితే.. మన పెద్దన్న ట్రంప్ వార్షిక వేతనం వారికంటే తక్కువేనంట.. వారు ఎవరంటే?సింగపూర్ ప్రధానమంత్రి వార్షిక వేతనం రూ.13.85 కోట్లు, స్విట్జర్లాండ్ అధ్యక్షుడి రూ.4.93 కోట్లు