దేవేంద్ర ఫడ్నవిస్ విద్యార్హతలు ఏంటో తెలుసా?
02 December
2024
TV9 Telugu
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కాబోతున్నారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఇంకా బిజెపి అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయన సీఎం కావడం ఖాయమని భావిస్తున్నారు.
మహారాష్ట్ర సీఎం రేసులో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ ఎంత వరకు చదువుకున్నారు..? ఏ డిగ్రీలు తీసుకున్నారో తెలుసా?
దేవేంద్ర ఫడ్నవిస్ 22 జూలై 1970న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. అంచెలంచెలుగా మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యనేతగా ఎదిగారు.
గతంలో 2014 నుంచి 2019 మహారాష్ట్ర సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్, బెర్లిన్ లో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశారు.
ఎమర్జెన్సీ సమయంలో తండ్రి గంగాధర్‌రావు అరెస్ట్ అయినప్పుడు దేవేంద్ర ఫడ్నవిస్ పేరును పాఠశాల నుంచి తొలగించారు.
ఫడ్నవీస్ ఇందిరా కాన్వెంట్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ పాఠశాలకు ఇందిరా గాంధీ పేరు పెట్టారు. కాబట్టి అతని పేరు తొలగించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కోపం ఎక్కువగా వస్తుందా.? ఈ విటమిన్ల లోపం కావచ్చు..
అమెరికా సైన్యంలో భారతీయుడు చేరవచ్చా?
చలికాలంలో ఈ డ్రింక్స్ చాలు.. బరువు సమస్య దూరం..