ఖర్జూరా ఎవరు తినకూడదో తెలుసా?

Samatha

20 January 2026

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఖర్జూరాలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పిల్లలు పెద్దవారు

ఖర్జూరాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి. అందుకే చాలా మంది వీటిని తమ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకుంటారు.

ఆరోగ్య ప్రయోజనాలు

అయితే వీటి వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటిని కొందరు తినడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉన్నదంట.

సైడ్ ఎఫెక్ట్స్

కాగా, అసలు ఖర్జూరాలను ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు, ఖర్జూర ఎవరు తినడం మంచిదికాదు అనే విషయం తెలుసుకుందాం.

ఎవరు తినకూడదంటే?

కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో ఖర్జూరాలు తినకూడదంట. ఇందులో ఉండే అధిక పొటాషియం, మూత్రపిండాల సమస్యలను తీవ్రతరం చేస్తుంది.

కిడ్నీ సమస్యలు

డయాబెటీస్ ఉన్న వారు కూడా ఖర్జూరాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా త్వరగా పెంచుతుందంట.

డయాబెటీస్

అదే విధంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఖర్జూర ఎక్కువగా తినకూడదు. ఇది కడుపు ఉబ్బరం , గ్యాస్ వంటి సమస్యలకు కారణం అవుతుంది.

జీర్ణ సమస్యలు

అలాగే, ఆస్తమా, శ్వాస సమస్యలు , అలెర్జీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా ఖర్జూరాలు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలెర్జీ