మనం ఇప్పటి వరకు ఆలయాలంటే సముద్రాల దగ్గర్లో, లేదా ఆలయాల్లో, కొండలపైన, ఊర్లలో ఉండడం చూసి ఉంటాం.. కానీ సముద్రంలో మధ్యలో ఎప్పుడైనా ఆలయం ఉండడం చూసి ఉంటారా?
ఈ ఆలయం గుజరాత్లో ఉంది. గుజరాత్ లోని వడోదరాకు 50 కిలోమీటర్ల దూరంలో స్తంభేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం గుజరాత్లో ఉంది. గుజరాత్ లోని వడోదరాకు 50 కిలోమీటర్ల దూరంలో స్తంభేశ్వర ఆలయం ఉంది.
దీంతో తారకాసురుడ్ని చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఈ నేపథ్యంలో కార్తకేయుడు దేవతల విశ్వకర్మ చేతితో 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు.
ఈ గుడి సమీపంలోనే మహానది అరేబియా సముద్రం కలవడం విశేషం. ఈ శివలింగాన్ని దర్శించుకున్న వారు తప్పుల నుంచి విముక్తులవుతారని ఓ నమ్మకం ఎప్పటి నుంచో ఉంది.
ఈ ఆలయాన్ని సముద్రపు ఒడ్డు నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం అక్కడికి కాలి నడకన వెళ్లి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు
ఈ దేవాలయ సందర్శన ఓ సాహసమే అని చెప్పాలి. ఒకవేళ అక్కడి వాతవారణ పరిస్థితులు అటు ఇటు అయిన ప్రాణాలు కోల్పోక తప్పదు.
ఈ ఆలయానికి 70 ఏళ్లు పై బడిన వారికి 10 ఏళ్లలోపు పిల్లలు దర్శనం చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఈ ఆలయంలో పూజరులు ఎవరు ఉండరు
భక్తులే ఆ ఆలయంలో పూజలు చేసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటల దాటిన తర్వాతే ఆలయం ప్రవేశం ఉంటుంది. మళ్లీ సాయంత్రం 6:30 గంటల లోపు ఒడ్డుకు చేరుకోవాలి.