ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ పండగకు ముందే వందే భారత్ స్లీపర్ ప్రారంభం!

10 September 2025

Samatha

ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ ప్రారంభంపై ఓ క్లారిటీ వచ్చింది.

ఎక్కువ వేగంతో చాలా తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో వందే భారత్ రైలు మొదటి స్థానంలో ఉంటుంది.

వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ త్వరలో ప్రారంభం కానున్నట్లు ఇండియా రైల్వే తెలిపిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై మరో క్లారిటీ ఇచ్చింది.

దీపావళి కంటే ముందే వందే భారత్ స్లీపర్ ప్రారంభం కానున్నదని తెలిపిందే. ఢిల్లీ నుంచి అహ్మదా బాద్ , పాట్నా మార్గాల్లో ఇది ప్రయాణిస్తుంది.

అంతా ఒకే అయితే, సెప్టెంబర్ చివరి వారంలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం అవుతుందని వారు పేర్కొన్నారు.

ఇది ఢిల్లీ, పాట్నా మధ్య నుంచి ప్రయాగ్ రాజ్ ద్వారా ప్రయాణించడం జరుగుతుంది. దీని మొత్తం సాధారణ ప్రయాణ సమయం 17 గంటలు కాగా, దీని ద్వారా 11 గంటలు పడుతుందంట.

కొన్ని నివేదికల ప్రకారం, వందే భారత్ స్లీపర్ ట్రైన్ రాత్రి 8 గంటలకు పాట్నా నుంచి ప్రారంభమై, ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.

దీని ద్వారా ప్రయాణికులకు సమయం తగ్గడమే కాకుండా,  ఈ రైలు రాజధాని కంటే చాలా సౌర్య వంతంగా ఉంటుందంట.