రతన్ టాటా చెప్పిన జీవిత సత్యాలు.. ప్రతి విద్యార్ధి మనసుపై రాసుకోవాల్సిందే!
12 October 2025
TV9 Telugu
TV9 Telugu
జీవితాన్ని కాచి వడపోసినవాళ్లు అనుభవజ్ఞులు. ఎత్తుపల్లాలు చూసి.. పడినా లేవటమే లక్ష్యంగా దూసుకుపోయేవారే విజేతలవుతారు. ఆ విజేతల మాటలు, ఆ విజయాలకు దారి తీసిన నేపథ్యాలు వారి మాటల్లో వినిపిస్తుంటాయి
TV9 Telugu
అటువంటి విజేత రతన్ టాటా. రతన్ టాటా నోట రత్నాల్లాంటి పలుకులెన్నో జాలువారాయి. ప్రతి మాట వెనుక గొప్ప తాత్విక చింతన, జీవితాన్ని వడకట్టిన తీరు అర్థమవుతుంది. ఇవి ప్రగతి సాధించాలనే పట్టుదల ఉన్న యువతకు వెలుగు దివిటీల్లా నిలుస్తాయి
TV9 Telugu
జనాలు మీపై విసిరే రాళ్లను తీసుకో.. వాటిని గొప్ప సౌధాన్ని నిర్మించడానికి ఉపయోగించండి. సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో, దృఢంగా ఉండండి. ఎందుకంటే.. విజయాన్ని నిర్మించుకోవడానికి అవే ఇటుకలు
TV9 Telugu
మన ప్రయాణం సాగుతూ ఉండాలంటే జీవితంలో ఎత్తుపల్లాలు చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈసీజీలో రేఖ తిన్నగా ఉన్నదంటే.. మనం జీవించిలేమని అర్థం
TV9 Telugu
ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. చాలా త్వరగా మారిపోతున్న ఈ ప్రపంచంలో రిస్క్ తీసుకోకపోవడం అంటే కచ్చితంగా విఫలమవడమే
TV9 Telugu
అవకాశాలు నీ దగ్గరకు వచ్చేంత వరకూ ఎదురుచూడకు. నువ్వే అవకాశాలు సృష్టించుకో. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు.. దానికి పట్టే తుప్పు తప్ప. అదే విధంగా ఒక వ్యక్తిని ఎవరూ నాశనం చేయలేరు.. అతని సొంత మనస్తత్వం తప్ప
TV9 Telugu
విజయం అంటే కేవలం ఫలితాలు మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న వారితో మనం ఎలా ప్రవర్తిస్తామో అనేది కూడా. ఇతరులతో వ్యవహరించేటప్పుడు దయ, సహానుభూతి, ప్రేమల శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు
TV9 Telugu
సరైన నిర్ణయాలు తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేను నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత వాటిని సరైనదిగా చేస్తాను. వేగంగా నడవాలనుకుంటే, ఒంటరిగా నడవండి. కానీ చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం కలిసి నడవండి
TV9 Telugu
మన జీవితం ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించలేక పోవచ్చు కానీ.. నీ ప్రాముఖ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దు. ఎందుకంటే.. సాహసం అనేది అంటురోగం లాంటిదని, ఆశ అనేది ప్రాణాన్ని తీస్తుందని చరిత్ర మనకు చూపింది