ఒకేసారి 35 కిలోలు తగ్గిన మహిళ.. ఏం చేసిందో తెలుసా?
12 August 2025
Prudvi Battula
పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చని ఏడు నెలల్లో 35 కిలోల బరువు తగ్గి నేహా అనే ఓ యువతి నిరూపించింది.
హార్మోన్ల సమస్యలు కారణంగా 91 కిలోలు పెరిగిన ఆమె తన 19వ పుట్టినరోజున తీసుకున్న నిర్ణయంతో 56 కిలోలకు చేరింది.
దీని కోసం ఆమె వేలకు వేలు ఖర్చు జిమ్‌లకు ఖర్చు చేయకుండా కేవలం ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ వ్యాయామాలను చెయ్యడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ముఖ్యంగా నేహా బరువు తగ్గడానికి కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా దూరం పెట్టింది. బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడేలా ఆ ఫుడ్స్ గురించి ఆమె పంచుకుంది.
ముందుగా ఆమె చక్కెర కలిపిన శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూసులు, కేకులు, పేస్ట్రీలు వంటి బేకరీ పదార్థాలు, ఐస్ క్రీమ్, చాక్లెట్లు, క్యాండీ బార్లు దూరం పెట్టింది.
చిప్స్, బిస్కెట్ల వంటి ప్రాసెస్ చేసిన స్నాక్స్, మైదాతో చేసిన బ్రెడ్, ఇతర పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని నేహా సూచించింది.
అలాగే నూనెలో బాగా వేయించిన ఆహారాలు (ఫ్రైడ్ ఫుడ్స్), ఫాస్ట్ ఫుడ్ కూడా పూర్తిగా తినకపోవడం మంచిదని ఆమె తెలిపింది.
వీటితో అధిక కొవ్వు ఉన్న మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర కలిపిన రెడీ-టు-ఈట్ తృణధాన్యాలు కూడా తివద్దని ఆమె చెప్పింది.