రానుంది చలికాలం.. అవిసె గింజల లడ్డుతో బోలెడు లాభాలు..
13 October 2025
Prudvi Battula
శీతాకాలంలో దోమల ఎక్కువగా ఉండడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిసిందే.
అంతే కాకుండా రోగనిరోధక శక్తి పడిపోయి పలు వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడకుండా రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల్లో అవిసె గింజల లడ్డు అద్భుతంగా పని చేస్తుంది.
చలికాలంలో అవిసె గింజలతో చేసిన లడ్డు ఇమ్యూనిటీని పెంచి, సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుందన్నది నిపుణుల మాట.
అవిసె గింజలు, బాదం, జీడి పప్పు, కిస్ మిస్, నెయ్యి, బెల్లం తురుము, యాలకుల పొడితో లడ్డును తయారు చేసుకోవాలి.
ఎంతో సింపుల్ గా ఉండే అవిసె గింజల లడ్డూలను చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చలికాలంలో తరుచూ తినవచ్చు.
అవిసెగింజల లడ్డు తినడం వలన ఎముకలు బలంగా, దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉంటే ఉపశమనం లభిస్తుంది.
మల బద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యల నివారణకు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి అవిసెగింజల లడ్డూను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?