రాత్రిళ్లు మంచం కింద.. ఓ గ్లాసు నీళ్లు పెట్టి నిద్ర పోయారంటే?

16 June 2025

TV9 Telugu

TV9 Telugu

నిద్రపోయేటప్పుడు మంచం కింద నీటితో నిండిన గ్లాసును ఉంచుకోవడం గురించి జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, కొన్ని జానపద నమ్మకాలు భిన్నమైన విషయాలను చెబుతున్నాయి

TV9 Telugu

మంచం కింద నీరు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి గ్రహిస్తుందని, ఇది మీకు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు

TV9 Telugu

మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే, అశాంతి అనిపిస్తే, పీడకలలు వస్తే మీ మంచం కింద నీరు ఉంచుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు

TV9 Telugu

ఇలా మంచం కింద నీరు ఉంచుకోవడం వల్ల చెడు కలలు రావు. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే, చంద్ర దోషంతో బాధపడుతుంటే, రాగి లేదా వెండి పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచాలి

TV9 Telugu

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిహారం శారీరక శక్తిని పెంచుతుంది. మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది. నిజానికి, నిద్రపోతున్నప్పుడు మనస్సు చాలా చురుకుగా ఉంటుంది

TV9 Telugu

మంచం కింద గ్లాసుడు నీటిని ఉంచడం వల్ల వరుణ దేవుడి ఆశీస్సులు లభిస్తాయని, ఇది జీవితంలో శాంతిని తీసుకు వస్తుందని నమ్మకం. మనసుకు విశ్రాంతి కూడా లభిస్తుంది

TV9 Telugu

రాగి స్వచ్ఛమైన లోహం, ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. కాబట్టి రాగి పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచడం ఇంకా ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

మంచం కింద నీళ్లు పెట్టి నిద్రపోతే అశాంతి తొలగిపోయి, హాయిగా నిద్ర పడుతుందనే భావన కేవలం వ్యక్తుల నమ్మకానికి సంబంధించింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ధృవీకరణ లేదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు