వారానికి 3సార్లు ఈ ఆకుల జ్యూస్ తాగితే ఊహించని లాభాలు..
Jyothi Gadda
17 February 2025
కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్ని పెంచడంలో కూడా బొప్పాయి ఆకులు ముందుంటాయి. మరి ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఏమేం లాభాలున్నాయో తెలుసుకోండి.
బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల జీర్ణ సమస్యలను, పేగుల్లో వాపు తగ్గుతుంది.
డెంగీ కారణంగా తగ్గే ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో బొప్పాయి ఆకుల రసం బాగా పని చేస్తుంది. బొప్పాయి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
తరచూ బొప్పాయి ఆకు రసం తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇందులోని ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి.
విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ముఖంపై మొటిమలు,నల్ల మచ్చలు, మడతలు రాకుండా ఉంటాయి. స్కిన్ యవ్వనంగా అందంగా కనిపిస్తుంది.
ఈ బొప్పాయి ఆకు రసాన్ని రెగ్యులర్‌గా తాగితే వృద్ధాప్య ప్రక్రియ నెమ్మది చేస్తుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. బొప్పాయి ఆకు రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి చర్మానికి మేలు చేస్తాయి.
ఈ ఆకులు క్యాన్సర్ నివరణగా పనిచేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కారణం ఇందులో ఉండే అసిటోజెనిన్ సమ్మేళనం. ఈ సమ్మేళనం క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
పీరియడ్స్ టైమ్‌లో ఎక్కువగా కడుపు నొప్పి, పొత్తికడుపు తిమ్మిరి వంటి సమస్యలకి చెక్ పెట్టేందుకు పీరియడ్స్ టైమ్‌లో బొప్పాయి ఆకురసాన్ని నువ్వులు, ఉప్పుతో కలిపి ఉడికించి తాగితే మంచిది.