భారత దేశంలో ద్రాక్షను అత్యధికంగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
samatha
11 february 2025
Credit: Instagram
ద్రాక్షపండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వీటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.
కానీ చాలా మందికి ద్రాక్షను మన భారత దేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా పండిస్తుందో తెలియదు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత దేశంలో ద్రాక్షను అత్యధికంగా పండించే రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రం ఎక్కువగా ద్రాక్షను ఉత్పత్తి చేస్తుందంట.టేబుల్ ద్రాక్ష, వైన్ ద్రాక్ష ఉత్పత్తి చేయడంలో ఈ రాష్ట్రమే ముందుంటుంది.
నాసిక్‌ను భారత దేశ ద్రాక్ష రాజధాని అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది విస్తారమైన ద్రాక్షతోటలను కలిగి ఉండటమే కాకుండా ఎగుమతి చేయడంలో కూడా ముందుంటుంది.
ఇవే కాకుండా సాంగ్లి, షోలాపూర్ కూడా ద్రాక్షపంట అత్యధికంగా పండిస్తాయి. ఈ పంటసాగుకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటం వలన అక్కడ ద్రాక్షను ఎక్కువగా పండిస్తారు.
ఈ రాష్ట్రం నుంచే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ద్రాక్షను సరఫరా చేస్తారు. అలాగే ఇక్కడి నుంచి ఎగుమతి చేయబడిన ఈ పంట ప్రపంచ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందంట.
మహారాష్ట్ర వాతావరణం ద్రాక్షపంటసాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. పొడి, వెచ్చని వాతావరణం వలన ద్రాక్షపంట అత్యధిక దిగుబడికి వస్తుంది.
అదే విధంగా ఈ రాష్ట్రంలో అనేక ద్రాక్ష పంటసాగులోనే కాకుండా వైన్ తయారీ ఉత్పత్తిలో కూడా మహారాష్ట్ర ముందంజలో ఉంది. నాసిక్ అగ్రశ్రేణి వైన్ బ్రాండ్లకు నిలయం.