బాడీలో ఈ పార్ట్‌పై పెర్ఫ్యూమ్ స్ర్పే చేస్తే.. రోజంతా పరిమళాలు మీ వెంటే!
22 January 2025
TV9 Telugu
TV9 Telugu
పెర్‌ఫ్యూమ్ లేకుండా బయట అడుగుపెట్టే వాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదు. అందుకే మనసు దోచే రకరకాల పెర్‌ఫ్యూమ్స్ అమ్మాయిల బ్యాగుల్లో ఒదిగిపోతున్నాయి
TV9 Telugu
అయితే.. పెర్‌ఫ్యూమ్‌ని ఎంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త.. వాటిని వాడటంపై చాలా మందికి ఉండదు. చాలా మంది రోజువారీ జీవనశైలిలో క్రమం తప్పకుండా రకరకాల పెర్ఫ్యూమ్, డియోడరెంట్‌లను వాడుతుంటారు
TV9 Telugu
కానీ చాలా త్వరగా దాని వాసన మసకబారుతుంది. దీంతో తాము వాడే బ్రాండ్ మంచిది కాదేమోనని అందరూ అనుకుంటారు. నిజానికి.. వీటి పరిమళం అధిక సమయం ఉండాలంటే ఓ చక్కని చిట్కా ఉంది
TV9 Telugu
పెర్ఫ్యూమ్ వాసన శరీరం నుంచి త్వరగా వెళ్లిపోవడానికి కారణం.. పెర్ఫ్యూమ్‌ని సరైన విధానంలో ఉపయోగించకపోవడమే. వీటి పరిమళం చాలా కాలం పాటు ఉండాలంటే శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలపై అప్లై చేయాలి
TV9 Telugu
మోచేతులపై పెర్ఫ్యూమ్ పూసినట్లయితే, అది సుదీర్ఘ కాలంపాటు సువాసనను ఇస్తుంది. శరీరంలో మరెక్కడా లేనంతగా ఇక్కడ వెచ్చగా ఉంటుంది. ఫలితంగా సువాసన మరింతగా వ్యాపిస్తుంది
TV9 Telugu
చాలా మంది గొంతు, మెడపై పెర్ఫ్యూమ్ ఉపయోగించరు. శరీరంలోని ఈ భాగంలో పెర్ఫ్యూమ్ పూయడం వల్ల సువాసనలు అధిక సమయం పాటు వ్యాపిస్తాయి
TV9 Telugu
అలాగే చేతి మణికట్టు మీద పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే.. అది రోజంతా సువాసనలు విరజిమ్ముతుంది. ఇయర్‌లోబ్ చాలా సున్నితమైన ప్రాంతం. పెర్ఫ్యూమ్‌ని మెడపై, చెవుల వెనుక పూయడం వల్ల దీర్ఘకాలం సువాసన నిలిచి ఉంటుంది
TV9 Telugu
పొట్ట భాగం కూడా. ఈ విషయం చెబితే చాలా మందికి ఆశ్చర్య పోతారు. నిజానికి.. పొట్టకు పెర్ఫ్యూమ్ రాసుకుంటే అది ఎక్కువసేపు ఉంటుందట. నాభి చుట్టూ వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సువాసన మరింత వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు