ప్రధాని మోదీకి అత్యంత ఇష్టమైన సినిమా ఏది?

17 September 2025

Balaraju Goud 

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ ప్రత్యేక సందర్భంగా, ఆయన అభిరుచుల గురించి తెలుసుకుందాం.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సినిమాలు చూస్తారా..? ఈ ప్రశ్న చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.

ప్రధాని మోదీకి అత్యంత ఇష్టమైన సినిమా ఏది అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది? సమాధానం తెలుసుకుందాం.

భారత దేశాన్ని నిర్వహించడంతో పాటు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినోద ప్రపంచంపై కూడా ఆసక్తి ఉంది.

జమ్మూ-కాశ్మీర్, లడఖ్, సిక్కింలలోని పిల్లలతో ప్రధాని మోదీ ఒకసారి సంభాషించారు. ఈ సమయంలో, ఆయన వారికి తనకు ఇష్టమైన చిత్రం గురించి చెప్పారు.

సంభాషణ సమయంలో, పిల్లలు ప్రధాని మోదీని మీకు ఇష్టమైన సినిమా గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చాలా ఫన్నీగా ఉంది.

తాను పెద్దగా సినిమాలు చూడనని.. కాకపోతే యువకుడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మిత్రుల ప్రోద్బలంతో కొన్ని చిత్రాలు చూశానన్నారు ప్రధాని.

దేవానంద్ నటించిన సినిమా 'గైడ్' తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అని వెల్లడించిన ప్రధాన మంత్రి ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ తాను సినిమా పాటలు కూడా వింటానని ఫిబ్రవరిలో జరిగిన ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ టూరులో మోదీ స్వయంగా పిల్లలతో చెప్పారు.

ప్రధాని మోదీకి నచ్చిన సినిమా విషయానికి వస్తే.. గైడ్ అనే సినిమా ఆర్కే నారాయణ్ నవలను ఆధారంగా తెరకెక్కించారు.