రాత్రి భోజనం తర్వాత మీరూ టీ తాగుతారా? కాస్త ఆగండి..
19 August 2025
TV9 Telugu
TV9 Telugu
సమయం ఏదైనా టైం దొరికినప్పుడల్లా కొందరు టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలామంది ‘టీ’లను ఆశ్రయిస్తుంటారు
TV9 Telugu
అందుకే చాలా మంది నిద్ర లేచిన వెంటనే టీతో తమ రోజును ప్రారంభిస్తారు. టీ ఇష్టపడే వారిలో కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత కూడా టీ తాగుతుంటారు
TV9 Telugu
అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత టీ తాగితే మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
రాత్రి భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఉబ్బరం, గ్యాస్ట్రిటిస్, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పాల టీతో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను రెట్టింపు చేస్తుంది
TV9 Telugu
రాత్రి భోజనం తర్వాత టీ తాగడం, ముఖ్యంగా బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఎందుకంటే అందులో కెఫిన్ నిద్ర పట్టకుండా అడ్డుకుంటుంది
TV9 Telugu
భోజనం చేసిన కనీసం 30-45 నిమిషాల తర్వాత టీ తాగడం మంచిది. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించదు. శరీరం ఐరన్ గ్రహించడంలోనూ సహాయపడుతుంది
TV9 Telugu
భోజనం చేసిన వెంటనే టీ తాగడం శరీరానికి మంచిది కాదు. తేలికపాటి హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగవచ్చు. కానీ అది కూడా భోజనం చేసిన కనీసం గంట తర్వాత తాగడం బెటర్
TV9 Telugu
చాలా మంది టీలో చక్కెర కలిపి తాగుతారు. లిక్కర్ టీ దానికంటే మంచిది. ఇది శరీరానికి తక్కువ హాని కలిగిస్తుంది. గుర్తుంచుకోండి టీలో చక్కెర కలిపితే.. ఎల్లప్పుడూ తక్కువ పరిమాణంలో మాత్రమే తాగాలి