చలికాలం కాళ్లకు సాక్సులు వేసుకొని పడుకుంటే ఏమవుతుంది?

Velpula Bharath Rao

19 December 2024

చాలా మంది చలి నుంచి ఉపశమనం కోసం మఫ్లర్ల, స్వెటర్లు, సాక్సులు వేసుకుంటూ ఉంటారు. ఇంకా కొందరైతే రాత్రి పడుకునేటప్పుడు కూడా సాక్సులు వేసుకుంటారు. 

చలికాలంలో వెచ్చగా, హాయిగా ఉంటుందని ఇలా రాత్రి పడుకునే ముందు సాక్సులు వేసుకుంటూ ఉంటారు. ఇలా చేయండి మంచిదేనా? 

దీని వల్ల లాభాలు, నష్టాలు ఏంటో చూద్దాం..సాక్సులు వేసుకుంటే పాదాలు వెచ్చగా, మంచిగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో బాడీలోని ఉష్ణోగ్రతలు కంట్రోల్‌లో ఉంటాయి.

దీంతో నిద్ర కూడా హాయిగా పడుతుంది. అలాగే కాలి నరాలకు ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

చలికాలం కాళ్లు పగలడం, రక్తప్రసరణ సమస్య, తిమిర్లు రావడం వంటివి తగ్గుతాయి. అలాగే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.

పాదాలు చల్లగా ఉంటే నిద్రపట్టక ఇబ్బంది పడుతారు. సాక్సులు వాడడం వల్ల పాదాలు వెచ్చగా అయి హాయిగా నిద్రపడుతుంది.

తడి సాక్సులు వేసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పొడి సాక్సులు వేసుకోవడం మంచిది.

సాక్సులు వేసుకొని పడుకోవడం వల్ల ఓ ఇబ్బంది కూడా ఉంది. అది ఏంటంటే పాదాలకు గాలి తగలకుండా చెమట పడుతుంది. దాంతో అసౌకర్యం కలుగుతుంది.