3 పూటలా అన్నం తింటున్నారా.. ఈ రోగాల్ని ఆహ్వానిస్తున్నట్లే..
Jyothi Gadda
18 February 2025
అన్నం ఇష్టమని మూడు పూటల అదే తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, రోజుకు ఎన్నిసార్లు అన్నం తినాలి? ఎక్కువైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?
అన్నం తినడం వల్ల ఉత్పత్తి అయ్యే రసాయనాలు కాలేయాన్ని దెబ్బతిస్తాయి. ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. శరీరానికి ఎక్కువ ఉపయోగం ఉండదు.
రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు అధికంగా చేరుతాయి. ఇది బరువు పెరగడం, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది.
అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు అధికంగా చేరుతాయి. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తినండి.
మధుమేహంతో బాధపడేవారు రోజుకు రెండుసార్లు అన్నం తినడం మానేయాలి. ఎందుకంటే ఇది త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదికాదు.
అన్నం త్వరగా జీర్ణమైనప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రాత్రుళ్లు అన్నం తినడం మంచిది కాదు. బియ్యంలో స్టార్చ్, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని ఈజీగా పెంచుతాయి.
రాత్రుళ్లు అన్నం తింటే త్వరగానే జీర్ణమవుతుంది. కానీ, నిద్ర సమయంలో మీ బాడీకి పోషకాలు అందవు. పైగా రాత్రంతా ఆకలితో ఉండడం వల్ల మరుసటి రోజు ఉదయాన్నే ఆకలిగా అనిపిస్తుంది.
కాబట్టి, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తినండి. ఇందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం ఉంటాయి.