రోజూ రెండు గుడ్లు తినొచ్చా..? తింటే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే..

11 August 2025

Prudvi Battula 

రోజుకో గుడ్డు తింటే మంచిదని పిల్లలకి తినిపిస్తుంటాం. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చాలామంది నమ్ముతారు.

కానీ ముప్పై ఏళ్లు తర్వాత గుడ్డు తింటే చెడుకొవ్వు (ఎల్‌డీఎల్‌) పెరుగుతుందని చాలామంది ఇది తినడం మానేశారు.

చెడు కొవ్వులు గుండె సమస్యలకు కారణం అవుతాయి. అందుకే గుడ్లను దూరం పెట్టడం మంచిదనే భావన చాలామందిలో ఉంది.

కానీ ఇది అపోహ మాత్రమే అని, గుడ్లు చెడుకొవ్వుని పెంచవు,  బాగా తగ్గిస్తాయని సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఎల్‌డీఎల్‌ పెరుగుదలకి ప్రధానంగా సంతృప్త కొవ్వులు. అవి ఉప్పు ఎక్కువగా ఉన్న మాంసాహారాలు, నూనెల తినడం వల్ల ఏర్పడతాయని  అంటున్నారు.

‘ఎల్‌డీఎల్‌ పెరగడానికి కారణమేంటీ గుడ్డా? శాచురేటెడ్‌ కొవ్వులా?’ అనే దానిపై ఇటీవల వాళ్లు విస్తృత పరిశోధన చేశారు. ఇలాంటి పరిశోధన తొలిసారట.

ఆస్ట్రేలియాలో కొవ్వుశాతం అధికంగా ఉన్న వ్యక్తులను రోజూ రెండు గుడ్లు తిని శాచురేటెడ్‌ కొవ్వులున్న ఆహారాన్నీ తక్కువగా ఉండేలా చూశారు.

అలా తిన్న వాళ్లందరిలోనూ ఎల్‌డీఎల్‌ గణనీయంగా తగ్గాయని వెల్లడైంది. కాబట్టి, నూనెల్నీ వేపుళ్లనీ తగ్గించి రోజూ రెండుగుడ్లు తింటే మంచిదని వారు అంటున్నారు.