వేసవిలో బెండను తినే ఆహారంలో చేర్చుకోండి.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
02 April 2025
Pic credit- Getty
TV9 Telugu
వేసవి కాలంలో ఆకుపచ్చ కూరగాయలు తినడం చాలా ప్రయోజనకరం. ఈ సీజన్‌లో బెండకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
విటమిన్ సి, కె, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు బెండకాయలో అధికంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వేసవిలో ప్రతిరోజూ తినే ఆహారంలో బెండకాయను చేర్చుకోవచ్చని డైటీషియన్ మోహిని డోంగ్రే చెప్పారు. ఇది రక్త ప్రసరణను సరిగ్గా ఉంచుతుంది
బెండకాయను తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించవచ్చు, దీనివల్ల గుండె బాగా పనిచేస్తుంది.
బెండకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని బలంగా ఉంచడంలో , కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
బెండకాయలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మృత కణాలను సరిచేసి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ దేశంలో 25ఏళ్ల లోపు పెళ్లి తప్పని సరి.. లేదంటే వింత శిక్షలు –
వేసవిలో పెరుగు, బెల్లం తింటే.. ఈ వ్యాధులకు మేడిసన్ అవసరం లేదు
తులసి మొక్కపై ఏ రంగు చీమలు కనిపిస్తే శుభప్రదం అంటే…