గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ తప్పులు చేశారో డేంజర్‌లో పడతారు..!
Jyothi Gadda
03 May 2025
ఆహారం తిన్న తర్వాత గ్రీన్ టీ తాగకూడదు. ఇది జీర్ణక్రియకు మంచిది కాదు. తిన్న తర్వాత కనీసం గంట ఆగాలి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ అసిడిటీ వస్తుంది. తిన్న తర్వాత తాగడం మంచిది.
గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది, ఎక్కువగా తాగితే తలనొప్పి వస్తుంది. వేడి గ్రీన్ టీలో తేనె కలపడం కూడా సరైనది కాదని అంటున్నారు నిపుణులు. చల్లారిన తర్వాత కలపవచ్చునని చెబుతున్నారు.
అలాగే, కొన్ని రకాల మందులు తీసుకునే వారు కూడా గ్రీన్ టీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు మందులతో పాటు గ్రీన్ టీ తాగకూడదని చెబుతున్నారు. గ్రీన్ టీని నెమ్మదిగా తాగాలి.
అలాగే, కొంతమంది గ్రీన్ టీని అతిగా తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యసమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే, ఒకేసారి 2 గ్రీన్ టీ బ్యాగులు వాడకండి.
గ్రీన్ టీలో ఉండే టానిన్స్ అనే పదార్థం కడుపులోని ఆమ్లాన్ని పెంచి అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఒక్కోసారి నిద్రలేమికి కారణం కావచ్చు.
ముఖ్యంగా రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కెఫీన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల తల్లనొప్పి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ అధికంగా తీసుకోవటం వల్ల ఆందోళన, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి సమస్యలు కలగవచ్చు. గ్రీన్ టీలో ఉండే టానిన్స్ ఐరన్ శోషణను తగ్గించి రక్తహీనతకు దారి తీయవచ్చు.
గర్భవతులు గ్రీన్ టీని అధికంగా తాగడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. గ్రీన్ టీ పాలిస్తీ గ్రంథులపై ప్రభావం చూపి హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చు.