ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. లంగ్స్ డేంజర్‌ లో పడినట్లు..

18 July 2025

Pic Credit: freepik.com 

TV9 Telugu

ఊపిరితిత్తులు శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇవి రక్తంలోని కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడంలో, ఆక్సిజన్ ప్రసరణలో సహాయపడతాయి. కనుక ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

అయితే ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపిస్తే పొరపాటున కూడా విస్మరించకూడదు. లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

మారుతున్న వాతావరణంలో దగ్గు రావడం సాధారణం. అయితే.. ఎవరికైనా పదే పదే దగ్గువస్తుంటే అది సాధారణం కాదు. ఈ సంకేతం ఊపిరితిత్తులలో సమస్యను సూచిస్తుంది.

న్యుమోనియా, బ్రోన్కైటిస్ లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడితే ఊపిరితిత్తుల బలహీనతను ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది. ఈ సంకేతాన్ని విస్మరించకండి.

శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో భారంగా అనిపించే వ్యక్తులు తప్పని సరిగా ఊపిరితిత్తుల గురించి ఆందోళన చెందాలి. ఈ లక్షణాలకు అర్ధం ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని.

ఛాతీ నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ కారణాలలో ఒకటి ఊపిరితిత్తుల పనితీరులో లోపం. శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి లేదా బిగుతుగా అనిపిస్తే ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం కావచ్చు. 

వ్యాయామం లేదా శారీరక శ్రమ సమయంలో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతారు. అయితే ఎటువంటి కారణం లేకుండా ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంటే ఊపిరితిత్తుల సమస్యలకు సూచన కావచ్చు. 

లంగ్స్ కి సంబంధించిన ఈ సంకేతాలను విస్మరించవద్దు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే సమయంలో  కొంత సమయం వ్యాయామం కూడా చేయాలి.