ప్రశాంతంగా బతకాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
8 September 2025
Samatha
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సంతోషం ప్రశాంతత అనేదే చాలా కరువై పోయింది. చాలా మంది ఎప్పుడూ బిజీ బిజీగా ఒత్తిడితో కాలం గడుపుతున్నారు.
అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా, ప్రశాంతంగా గడపడమే కాకుండా మెదడు, మనసు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే? కొన్ని టిప్స్ పాటించాలంట.
ఉదయం అయ్యిందంటే ప్రతి ఒక్కరూ ఫోన్‌కే అడక్ట్ అవుతున్నారు. అందుకే ఫోన్‌కు దూరంగా ఉండాలంట, అలా కనీసం ఉదయం గంట ఫోన్ చూడకుండా ఉంటే ఒత్తిడి తగ్గుతుందంట.
అలాగే, మీరు ఎక్కువ ఆందోళన లేదా ఒత్తిడికి గురి అయినప్పుడు కాసేపు ఆగి లోతైన శ్వాస తీసుకోండి. దీని వలన మీ మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.ఒత్తిడి తగ్గుతుంది.
మీ ఇంట్లో ఏదో ఒక పని చేయడం, ముఖ్యంగా షెల్ఫ్స్ సర్దడం ఇంటిని నీటుగా తయారు చేసుకోండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
మీరు ఉదయం లేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగడానికి బదులుగా, గ్లాస్ వాటర్ తాగి రెండు నిమిషాలు కూర్చోండి. ఇది మీ మనసుకు హాయినిస్తుంది.
ప్రకృతిలో సేద తీరడం చాలా మంచిది. అందువలన ప్రతి రోజూ 10 నిమిషాల పాటు మీరు మీ దగ్గరిలోని పార్క్‌లో వాకింగ్ చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రతి కూల వార్తలను ఎక్కువగా చూడటం వలన కూడా మీ మైండ్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే వీలైనంత వరకు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండండి.