రోజ్ వాటర్‌ని ఇలా వాడితే అందానికి మీరే కేరాఫ్ అడ్రస్ ..!
05 October 2025
Jyothi Gadda
అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ, చాలా మంది ముఖం డల్‌గా ఉంటారు. అలాంటివారికి రోజ్ వాటర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీ ముఖం మిలమిలా మెరిసేలా చేస్తుంది.
నిమ్మకాయ, రోజ్ వాటర్ కలిపి ముఖాన్ని 10 నిమిషాలు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో మీ ముఖానికి సహజమైన కాంతి వస్తుంది.
ముఖం చాలా డల్ గా ఉంటే, ఏదైనా కార్యక్రమానికి వెళ్లే ముందు రోజ్ వాటర్ అప్లై చేసి దానిపై దోసకాయ ముక్కను రుద్దండి. నిమిషాల్లో మీ ముఖంలో కొత్త ఉత్తేజం కనిపిస్తుంది.
మిల్క్ క్రీమ్, రోజ్ వాటర్ పేస్ట్ తో 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇప్పుడు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. దీంతో రోజంతా ముఖం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
2 టీస్పూన్ల గంధపు పొడిని అరకప్పు రోజ్ వాటర్, ఒక టీస్పూన్ పసుపుతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖంపై మచ్చలు పోతాయి. ఇది మీ ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి.
మొటిమలను తొలగించడానికి 2 టీస్పూన్ల గ్రీన్ టీ, అందులో ఒక చెంచా పెరుగు కలిపి ప్యాక్ తయారు చేసుకుని ముఖం, మెడకు అప్లై చేయాలి.10 నిమిషాల తర్వాత వాష్ చేస్తే ఫలితం ఉంటుంది.
రోజ్ వాటర్ ను రెగ్యులర్ గా వాడుతుంటే చర్మం రంగు మెరుగవుతుంది. చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది.
రోజ్ వాటర్ చర్మాన్ని చల్ల బరుస్తుంది. చర్మం మీద మంటలు, చికాకులు తగ్గించి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మ సంబంధ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.