ఆ సమస్యలు ఉన్నవారికి వరం ఈ జ్యూస్.. తాగితే ఎంత మంచిదో..

Samatha

28 october 2025

కాన్బెర్రీస్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

కాన్బెర్రీస్ జ్యూస్

కాన్బెర్రీ జ్యూస్‌ ప్రతి రోజూ తాగడం వలన ఇందులో ఉండే ప్రోయాంథోసైనిడిన్స్ , వంటివి యూరినీరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుందంట.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్

కాన్బెర్రీస్‌లో ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, ఫినోలిక్ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి ఒత్తిడి, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని కాపాడుతుందట.

ఒత్తిడి

కాన్బెర్రీస్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. అందువలన ఇది మీ శరీరంలోని ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించి, రోగనిరోధక శక్తి పెంచుతుందంట. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రోగనిరోధకశక్తి

గుండె ఆరోగ్యానికి కూడా కాన్బెర్రీస్ చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి, రక్తపోటు తగ్గించి, గుండె జబ్బులను తగ్గిస్తుంది.

గుండెకు మంచిది

కాన్బెర్రీస్ జ్యూస్ ప్రతి రోజూ కనీసం ఒక గ్లాస్ తాగడం వలన ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా కడుపు సమస్యలను తగ్గించి, గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది.

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ

కాన్బెర్రీస్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రోజూ ఈ జ్యూస్ తాగడం వలన ఇది క్యాన్సర్, పెద్ద పేగు, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి కణితుల పెరుగుదలను అడ్డుకుంటుంది.

క్యాన్సర్ నివారణ

రోజూ కాన్బెర్రీస్ జ్యూస్ తాగడం వలన ఇది దంతాల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, నోటి దుర్వాసన తగ్గిస్తుంది. అలాగే దందాలను, చిగుళ్లను రక్షిస్తుంది.

దంతాల ఆరోగ్యం