సంపదనిచ్చే కాయిన్ ప్లాంట్.. ఇంట్లో ఎలా పెంచాలో తెలుసా?
Samatha
2 February 2026
కాయిన్ ప్లాంట్ మొక్క చాలా మంచిది. ఇది వాతావరణాన్ని తాజాగా ఉంచడమే కాకుండా, ఆదాయాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
కాయిన్ ప్లాంట్
చాలా మంది ఇంటిలో స్వచ్ఛమైన గాలి కోసం తమ ఇంటిలో కాయిన్ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. అంతే కాకుండా ఇది వాస్తు ప్రకారం కూడా అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా సంపదను పెంచుతుంది.
స్వచ్ఛమైన గాలి
అయితే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కలిసొచ్చే మొక్కను మీ ఇంటిలో కూడా పెంచుకోవాలి అనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ మీ కోసం.
ఫైనాన్షియల్
కాయిన్ ప్లాంట్ మొక్కను పెంచాలి అంటే సూర్య కాంతి తప్పని సరి, ఈ మొక్కకు రోజులో తప్పని సరి కొంచెం సూర్యకాంతి అందేలా చూడాలి.
సూర్య కాంతి
అలాగే దీనిని మట్టి కుండలో పెంచడం చాలా మంచిది. దీని వలన కుండలోని నీరు ఇంకి పోకుండా ఎప్పుడూ వేర్లను తేమగా ఉంచుతాయి. ఇది మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
మట్టి కుండ
కాయిన్ ప్లాంట్ మొక్క మంచిగా పెరగాలి అంటే తప్పకుండా దానికి తగినన్ని నీరు అవసరం. రోజూ క్రమం తప్పకుండా మొక్కకు నీరు అందించాలి.
నీరు
అలాగే ఈ మొక్కను నేలపై పెంచాలి అనుకునే సమయంలో నేల నాణ్యతను పరీక్షించాలి. సేంద్రియ ఎరువులు, ఆవు పేడ వంటి వాటిని ఈ మొక్క పెరుగుదలకు ఉపయోగించ వచ్చు.
నేల
అదే విధంగా కాయిన్ ప్లాంట్ మొక్కను కీటకాల నుంచి రక్షించడానికి వేప నూనె ఉపయోగించడం, స్ప్రే బాటిల్ నీటిలో వేప నూనె వేసి పిచుకారీ చేయాలి