అబ్బ ఇది కదా కావాల్సింది.. టోల్ పేతో మస్త్ మనీ సేవ్..
14 October 2025
Prudvi Battula
జాతీయ రహదారుల రుసుము (రేట్లు, వసూలు నిర్ణయం) (మూడవ సవరణ) 2025 నియమాలని ఇప్పటికే ఫిక్స్ చేసింది భారత ప్రభుత్వం.
ఇది నవంబర్ 15, 2025 నుండి అమల్లోకి వస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) శనివారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
కొత్త నిబంధన ప్రకారం, ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ఫీజు ప్లాజాలోకి ప్రవేశించే వాహనాలకు, ఫీజు చెల్లింపు నగదు రూపంలో జరిగితే, రుసుము కంటే రెండింతలు వసూలు చేయబడుతుంది.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా టోల్ పే చేసే వినియోగదారులకు, రుసుము కంటే 1.25 రెట్లు మాత్రమే వసూలు చేయబడుతుంది.
ఒక నిర్దిష్ట వర్గం వాహనానికి సాధారణ టోల్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా రూ. 100 అయితే, వినియోగదారు ఇప్పుడు UPI ద్వారా రూ. 125 లేదా రూ. 200 నగదు చెల్లించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, పారదర్శకతను పెంచడానికి, జాతీయ రహదారులపై టోల్ వసూలును క్రమబద్ధీకరించడానికి ఈవ్ నిర్ణయం తీసుకున్నారు.
టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి, మరింత సమర్థవంతమైన టోల్ నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం.
ఈ సవరణ రుసుము వసూలు ప్రక్రియను బలోపేతం చేయడం, టోల్ వసూలులో పారదర్శకతను పెంచడం, జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది,