ప్రస్తుతం ప్రతి ఒకరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దీని వలన బట్టలను ఉతికే బాధ చాలా మందికి తప్పిందనే చెనప్పాలి.
ఆఫీసుకు వెళ్లే వారు, బిజినెస్ చేసుకునేవారు ఎక్కువగా వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేస్తుంటారు. ముఖ్యంగా వాషింగ్ మెషీన్‌లో ఉతకకూడనివి కూడా ఉతికేస్తుంటారు.
దీని వలన బట్టలు చెడిపోవడమే కాకుండా వాషింగ్ మెషీన్ కండీషన్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అందువలన వాషింగ్ మెషీన్‌లో వేయకూడనివి ఏవో చూద్దాం.
వాషింగ్ మెషీన్‌లో అస్సలే లెదర్ జాకెట్లు, బూట్లు, బ్యాగులు, బెల్ట్‌లు వేయకూడదంట. దీని వలన అవి పాడైపోయే ఛాన్స్ ఉంటుందంట.
కొందరు బట్టలు ఉతకడం ఇష్టం లేక, పట్టు చీరలను సైతం, వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటారు. దీని వలన ఖరీదైన చీరలు పాడైపోవడం జరుగుతుందంట. వీటిని వాషింగ్ మెషీన్‌లో వేయకూడదంట.
ఉన్ని బట్టలు, ఎండ్రాయిడరీ, స్టోన్ వర్క్ సారీస్, డ్రెసెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మెషీన్‌లో వేయకూడదంట. దీని వలన స్టోన్స్ రాలిపోయి దుస్తులు పాడవుతాయి.
కొంత మంది లోదుస్తులను కూడా వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటారు. అయితే వీలైనంత వరకు లోదుస్తులను వాషింగ్ మెషీన్‌లో అస్సలే వేయకూడదంట.
ఇంకొంత మంది పర్సులు, బెల్ట్‌లు , జెర్సీలను వాషింగ్ మెషీన్‌లో వేస్తారు. ఇవి కూడా వాషింగ్ మెషీన్‌లో వేయూడదు దీని వలన అవి రంగును కోల్పోయి పాడయ్యే అవకాశం ఉంటుందంట.