అచ్చం ఉల్లి మాదిరే..! రోజూ 2 రెబ్బలు నోట్లో వేసుకున్నారంటే..
03 September 2025
TV9 Telugu
TV9 Telugu
ఉల్లి మాదిరి.. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు
TV9 Telugu
వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం
TV9 Telugu
ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
ఇందులో మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి రక్తంలో చక్కెరను నియంత్రించడం నుంచి క్యాన్సర్ నివారణ వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు అందిస్తుంది
TV9 Telugu
అయితే ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది
TV9 Telugu
అంతేకాకుండా ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది
TV9 Telugu
ఎందుకంటే ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అసిడిటీ, అల్సర్ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి రెబ్బలను తినకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది