ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారు తీసుకోవాల్సిన ఆహారం ఇదే!

Samatha

4 july  2025

Credit: Instagram

కొంత మంది ఏసీకి ఎక్కువగా అడెక్ట్ అవుతుంటారు. చలికాలం అయినా, వర్షాకాలం అయినా, ఎండాకాలం అయినా సరే ఎక్కువ సేపు ఏసీలో ఉండటానికి ఇష్టపడుతారు.

కానీ ఏసీలో ఎక్కువ సేపు ఉండటం అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయంట.

ప్రతి రోజూ కనీసం 10 గంటలకంటే ఎక్కువ సేపు ఏసీలో ఉన్నా ఇది ఎముకల బలహీనతకు కారణం అవుతుందంట. దీని వలన ఎముకలు బలహీనపడతాయి.

అంతేకాకుండా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉండటం వలన ఇది జీర్ణక్రిపై ప్రభావం చూపుతుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదంట.

దీని వలన ఎముకలకు రక్తప్రసరణ తగ్గడమే కాకుండా, వాటికి అవసరమైన పోషకాలు కూడా తగ్గిపోయి, ఎముకలు చాలా బలహీనం అవుతాయంట.

అందుకే ఏసీలో ఎక్కువ సేపు కూర్చునే వారు తప్పకుండా ఎముకల బలానికి ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాలు తాగాలి.

అంతే కాకుండా, పెరుగు, పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులకు సంబంధించిన ఆహారపదార్థాలు తీసుకోవడం కూడా చాలా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

అలాగే, పాలకూర, బ్రోకటీ, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకోవాలంట. ఇవి శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్‌ను అందిస్తుంది.