ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ మధ్య చాలా మంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా, చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతుంది
రోజు రోజుకు క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. చాపకింద నీరులా క్యాన్సర్ విస్తరిస్తుంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.
క్యాన్సర్‌లో చాలా రకాలు ఉంటాయి.అందులో పెద్ద పేగు క్యాన్సర్ ఒకటి. దీనిని కొలొరెక్టల్ క్యాన్సర్ అని కూడా అంటారు.
అయితే ఈ క్యాన్సర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇది గతంలో వృద్ధుల్లో మాత్రమే కనిపించేది.
కానీ ప్రస్తుతం యువత కూడా పెద్ద పేగు క్యాన్సర్ భారిన పడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, మధ్యపానం, వంటి వాటి వలన చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
వారం రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు మలబద్ధకం లేదా అధికంగా వీరేచనాలు కావడం పెద్ద పేగు క్యాన్సర్ లక్షణం.
అలాగే, మల విసర్జన సమయంలో రక్త స్రావం, గ్యాస్ ఎక్కు పోతుండటం, అలసట, నీరసం, రక్తహీనత, మల విసర్జన తర్వాత కడుపు ఖాళీ అవ్వడం, గ్యాస్, తిమ్మరి, లేదా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.