ఏపీలోని కాణిపాకం వినాయుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం భక్తుల కోరికలను తీర్చుతుందని నమ్మకం.
కేరళలోని మహాగణపతి ఆలయం చాలా ఫేమస్. ఇది మధుర్వాహిని నది ఒడ్డున ఉన్న పురాతన ఆలయం. ఇక్కడికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి సమీపంలో ఉన్న బడా గణేష్ మందిర్ ప్రపంచంలోనే అతి పెద్ద గణేష్ విగ్రహాలలో ఒకటి.
ముంబైలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం, ఫేమస్ టెంపుల్స్‌లో ఒకటి. ఇక్కడి విగ్రహం భక్తుల కోరికలను నెరవేర్చడం, ఆనందాన్ని నింపుతుందని భక్తుల నమ్మకం.
దగ్దు సేత్ హల్వాయి ఆలయం పూణే. ఈ టెంపుల్ అందమైన నిర్మాణశైలితో చరిత్రకు ప్రసిద్ధి చెందినది. దీనిని 1893లో నిర్మించారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని రాక్ ఫోర్ట్ పై ఉన్న గణేశ్ ఆలయం చాలా ప్రసిద్ధ దేవాలయం. విభీషనుడితో ఉన్న ఈ టెంపుల్ పౌరాణిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి.
ప్రసిద్ధ వినాయకుడి విగ్రహాల్లో రణతంబోర్ గణేష్ ఆలయం ఒకటి. ఇది రాజస్థాన్‌లో ఉంది. ముఖ్యంగా వివాహ పత్రికలను మొదటగా ఈ ఆలయానికే తీసుకెళ్లడం అక్కడి అనవాయితీ.
చింతామన్ గణేష్ ఆలయం, మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ లో ఉంది. రాజు విక్రమాదిత్యుడు నిర్మించిన ఈ టెంపుల్ ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి.