ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహం ఎక్కడుందో తెలుసా?

Samatha

24 August  2025

Credit: Instagram

వినాయక పండుగ వచ్చేసింది. మరో రెండు రోజుల్లో దేశం అంతటా వినాయకుడి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే ప్రతి వాడలో, గల్లీలో వినాయకుడి మండపాలను అందంగా ముస్తాబు చేశారు. వినాయకుడి మండపాలతో వాడ వాడల్లో సందడి నెలకొంది.

ఇక చాలా మంది తాము పెద్ద వినాయకుడిని కొనుగోలు చేయాలని, అందరికంటే తమదే పెద్దగా ఉండాలని భావిస్తుంటారు.

ఇక ఇక్కడ పెద్ద వినాయకుడి విగ్రహం అంటే అందరికీ, హైదరాబాద్, ఖైరాతబాద్ వినాయకుడే గుర్తుకు వస్తారు. కానీ ఖైరతాబాద్ వినాయకుడి కంటే ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఉన్నదంట.

కాగా, ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఎత్తైన వినాయకుడి విగ్రహం ఎక్కడ ఉంది. ఇది ఏ దేశంలో ఏ నగరంలో ఉందో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే ఎత్తైన గణేష్ విగ్రహం థాయిలాండ్ లోని చాచోయెంగ్సావో లో ఉన్నదంట. దీనిని చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తూనే ఉంటారంట.

అక్కడి ఈ గణపయ్య, మామిడి, అరటి పండు, చెరుకు, పనసపండు వంటి నాలుగు వస్తువులను తన చేతులో పట్టుకొని దర్శనం ఇస్తాడు.

2012లో తయారు చేయబడిన ఈ విగ్రహం 40000 చదరపు అడుగుల్లో,  దాదాపు 12 అడుగుల పొడవు లేదా 14 అంతస్తుల భవనం ఎత్తు ఉంటుందంట.