ఎక్కువ రోజులు బతకాలనుకుంటున్నారా? ఈ టిప్స్ తెలుసుకోండి!
08 october 2025
Samatha
దీర్ఘాయువుగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం కారణంగా చాలా మంది అనేక వ్యాధులతో చాలా త్వరగా మరణిస్తున్నారు.
కానీ మన పూర్వీకులు 100 సంవత్సరాలు బతికిన వారు ఉన్నారు. మరి ఇప్పుడున్న వారి ఆయష్షు విషయానికి వస్తే 70 సంత్సరాలు బతికినవారే చాలా గొప్ప అంటుంటారు. అందుకు కారణం మారుతున్న జీవనశైలి.
అయితే తాజాగా 117 సంవత్సరాలు జీవించి ఉన్న ఓ వృద్ధమహిళను పరిశోధకులు అధ్యయనం చేయగా, ఆమె ఎక్కువరోజులు బతికి ఉండటం వెనుకున్న కారణాలు, అలాగే ఆయుష్షు పెంచే చిట్కాలను తెలిపారు.
దీర్ఘాయువుగా ఉండాలంటే, వృద్ధ మహిళ పాటించిన డైట్ ఫాలో అవ్వాలంట. ముఖ్యంగా ప్రతి రోజూ ఎక్కువ నూనెలు లేని పోషకాహారం, ఆకు కూరలు, వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలంట.
అదే విధంగా, భోజనంలో పెరుగు తప్పనిసరి, పెరుగులో గట్ మైక్రోబయోమ్‌ను పెంచే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుంది. వృద్ధ్యాప్యాన్ని తగ్గిస్తుందంట.
అదే విధంగా ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసర, కొందరు వాకింగ్ చేస్తే చాలు అనుకుంటారు. కానీ నడకతో పాటు శారీకమైన, బలాన్నిచ్చే పనులు చేయడం మంచిదంట.
అంతే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం కూడా ఆయుష్షును పెంచుతుందంటున్నారు పరిశోధకులు. కుటుంబ సభ్యులో మచి సంబంధం మంచిది.
దీని వలన మనసు చాలా ఆనందంగా ఉండటంతో మెదడు డోపమైన విడుదల చేస్తుంది. దీని వలన అనేక హార్మోన్లు విడుదలై ఆరోగ్యం బాగుటుంది. ఆయుష్షు పెరుగుతుందంట.