డెంగ్యూ లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకపోతే కష్టమే!
Samatha
15 july 2025
Credit: Instagram
వర్షాకాంలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు వ్యాపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి.
తేమ వాతావరణం, దోమలు, అపరిశుభ్రత కారణంగా ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి.
కాగా, మనం ఇప్పుడు డెంగ్యూ జ్వరం వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏ లక్షణాలను
విస్మరించకూడదో చూద్దాం.
డెంగ్యూ అనేది అకస్మాత్తుగా తీవ్రతరం అవుతుందంట. దీని వలన తీవ్రమైన తలనొప్పి, వాంతులు, తల తిరగడం, రక్తస్రా
వం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిరంతరం వాంతులు అవుతున్నా, గంటలు గడుస్తున్నా వాంతులు అనేవి తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలంట.
డెంగ్యూ వ్యాధి సోకితే, ఆ వ్యక్తులకు నిరంతరం తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుందంట. తరచుగా ఇలానే కడుపు నొప్పి ఉంటే తప్పక డెంగ్యూ టెస్ట్ చేయించుకోవాలంట.
అలాగే, విపరీతమైన అలసట, నడవ లేకపోవడం, మీ శరీరం చాల అలసిపోయినట్లు, ఏదీ తట్టుకోలేని విధంగా ఉంటే, అది డెంగ్యూ ప్రారంభ సంకేతం కావచ్చు అంటున్నారు వై
ద్యులు.
చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్త స్రావం, ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపించడం, మైకం కమ్మడం, విపరీతమైన ఫీవర్ డెంగ్యూ లక్షనాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఇలాంటి వ్యక్తులు మరణించే వరకు పేదవారిగానే ఉంటారు!
శ్రావణ మాసంలో కలలో పాములు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
ఉదయాన్నే గ్రీన్ టీ తాగేవారి వ్యక్తిత్వం ఇదే!