బీకేర్ ఫుల్.. పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలివే!
09 october 2025
Samatha
పక్షవాతాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు. అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని ఓ భాగానికి రక్త సరఫర ఆగిపోయినప్పుడు వస్తుంది.
ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైనది. కొన్ని సార్లు ఇది అంగ వైకల్యానికి కారణం అవుతే, మరికొన్ని సార్లు ఇది ప్రాణానికే ప్రమాదకరం కావచ్చు.
కాగా, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీనిని ఎలా గుర్తించి, త్వరితగతిన వైద్య సహాయం అందించాలో ఇప్పుడు చూద్దాం.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక కాలు లేదా, నోరు, ముఖం ఒక వైపు వంకరగా అవుతుంది. మాట్లాడుతున్నప్పుడే ఇలా ముఖం వంకర అవుతుందని అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అలాగే పక్షవాతం వచ్చే మందు, చేతులు, కాళ్లలో బలహీనత, శరీరం ఒక వైపు బలహీనంగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయంట.
అదే విధంగా కొంత మందిలో ఆకస్మికంగ తలనొప్పి, దృష్టిని కోల్పోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మతిమరపు ఎక్కువ అవ్వడం జరుగుతుందంట.
అలాగే ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా తల తిరగడం, నిలబడలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం వంటివి కూడా స్ట్రోక్ కు సంకేతాలంటున్నారు వైద్య నిపుణులు.
నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు, కేవలం పాఠకుల ఆసక్తిమేరకే ఇవ్వబడినది.