ప్రతి చిన్న విషయానికే డిప్రషన్‌లోకి వెళ్తున్నారా.. కారణాలు ఇవే!
22 September 2025
Samatha
డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య. దీన వలన చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు చాలా బాధించిన విషయాలకు డిప్రెషన్‌కు లోనవుతే, మరికొందరు మాత్రం చిన్న విషయాలకే డిప్రెషన్‌లోకి వెళ్తారు.
దీంతో ఎంటీ ప్రతి చిన్న విషయానికే డిప్రెషన్‌లోకి వెళ్తున్నామంటూ కుమిలిపోతుంటారు. కాగా, అసలు ఏ కారణం చేత చిన్న విషయాలకు కూడా డిప్రెషన్‌లోకి వెళ్తారో ఇప్పుడు తెలుసుకుందాం
డిప్రెషన్ అనేది శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని వలన అలసట, బలహీనత, ఊబకాయం, గుండెజబ్బులు, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయంట.
ఒత్తిడితో కూడిన సంఘటనలు, మీకు చాలా ఇష్టమైన వారికి దూరం అవ్వడం, కుటుంబ కలహాలు, శారీరక సమస్యలు కూడా కొన్ని సార్లు మిమ్మల్ని డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాయి
అయితే మెదడులోని సెరోటోనిన్ డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల అసమతుల్యత వంటివి డిప్రెషన్‌కు దారి తీస్తాయంట. దీని వలన చిన్న విషయాలకే డిప్రెషన్‌లోకి వెళ్తుంటారంట.
అంతే కాకుండా కుటుంబంలో ఎవరికైనా డిప్రెషన్ సమస్య ఉంటే, ఆ కుటుంబంలోని మరో వ్యక్తికి కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.
మధుమేహం, థైరాయిడ్, వంటి దీర్ఘకాలిక వ్యాధులు, గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత, హార్మోన్ మార్పులు కూడా డిప్రెషన్‌కు కారణం అవుతాయంట.
కొన్ని మందులు వాడటం, మద్యం ,వంటి వాటి వలన కూడా డిప్రెషన్ సమస్య వస్తుందంట. నోట్ ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.