నోరూరించే, మేక లివర్ ఫ్రై.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తింటారు!

21 September 2025

Samatha

మేక లివర్ ఫ్రై ఇంట్లో ఇలా సింపుల్‌గా చేస్తే టేస్ట్ అదిరిపోవడమే కాకుండా, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందంట. మరి దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, సోంపు, ఎండు మిర్చీ, నూనె, ధనియాల పౌడర్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడ.

గరం మసాలా, సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయ ముక్కలు,పూదీన.  ప్రిపరేషన్ కోసం, మేక లివర్ శుభ్రం చేసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత లివర్ ‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు, పసుపు, ధనియాల పౌడర్, కారం, గరం మసాలా వేసి వటన్నింటిని కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి, బౌల్ పెట్టి, నూనె పోసి, వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ, పూదీన, కరివేపాకు, సుగంధ ద్రవ్యాలు, చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి.

తర్వాత కొబ్బరి పొడి వేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న మేక లివర్ మివశ్రమాన్ని వేయాలి. 

 ఆ తర్వాత కారం, రుచికి సరిపడ ఉప్పు, గరం మాసాల, ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేయాలి.10 నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండాలి

తర్వాత ఒక కప్పు నీరు పోసి, అది మంచిగా ఉడికి, దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. దగ్గరగా వచ్చాక ఐదు నిమిషాలు వేయించాలి. అంతే స్పైసీ మేక లివర్ ఫ్రై రెడీ.