ఈ ఆహారం కిడ్నీలకు చాలా డేంజర్.. తింటే ఆసుపత్రి బెడ్ ఎక్కడమే!
21 September 2025
Samatha
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. కానీ ఈ మధ్య చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వాటిన బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రిక్స్ తీసుకోకూడదంట.ఇవి కిడ్నీలను చాలా త్వరగా పాడు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
చాలా మంది ఇప్పుడు ప్యాకెజ్ ఫుడ్, స్నాక్స్, పికిల్స్‌కు ఎక్కువగా అలవాటు పడ్డారు. కానీ ఇటవంటి ఆహార పదార్థాలు కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయంట
అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, కెమికల్ ఫుడ్, అతిగా స్వీట్స్ తీసుకోవడం, ఆలూ చిప్స్ వంటివి ఎక్కువగా తినడం వలన కూడా కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుందంట.
కొందరు విపరీతంగా డ్రింక్స్ తాగడం చేస్తుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని, ఇది కిడ్నీ, లివర్, గుండెకు సంబంధించి అనేక సమస్యలకు కారణం అవుతుందంట.