పడుకునే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
21 october 2025
Samatha
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ గ్లాస్ పాలు తాగడానికి ఇష్టపడుతారు.
అంతే కాకుండా, ప్రతి తల్లి దండ్రులు కూడా తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు పాలు తాగిస్తుంటారు
కానీ రాత్రి పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు పాలు తాగించకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు . ఎందుకంటే?
పాలల్లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, భాస్వరం, పొటాషియం, అయోడిన్, నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగ
ా ఉంటాయి.
అందువలన రోజూ పాలు రోజూ తాగడం వలన ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా, దంతాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే పాలు తాగాలని చెబుత
ుంటారు ఆరోగ్యినిపుణులు.
కానీ రాత్రి సమయంలో పిల్లలకు పాలు తాగించడం మంచిది కాదంట. ముఖ్యంగా రెండు నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు రాత్రి పాలు ఇవ్వకూడదంట.
రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలు తాగివ్వడం వలన కడుపు సంబంధిత సమస్యలు, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
కొంత మందికి రాత్రి సమయంలో పాలు తాగించడం వలన దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. అలాగే చక్కెర కలిపిన పాలు తాగడం వలన అధిక బరువు
పెరిగే ఛాన్స్ ఉన్నదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కంటి నిండా , హాయిగా నిద్రపోవాలంటే, ఏవైపు పడుకోవాలో తెలుసా?
తమలపాకులు చేసే మేలు తెలుసా..?
పల్లీలతో పది ప్రయోజనాలు.. ఇది తెలిస్తే తింటూనే ఉంటారు!