టేస్ట్ అదిరిపోద్ది అని ప్రతి వంటల్లో బిర్యానీ ఆకు వేస్తున్నారా.. ఇది తెలుసుకోండి!

18 September 2025

Samatha

నాన్ వెజ్ వంటకాలు అయినా సరే, వెజ్ వంటల్లోనైనా సరే బిర్యానీ ఆకు వేస్తే  ఆ వంటకాలకు ఉండే టేస్టే వేరే లెవల్ ఉంటుంది.

అందుకే చాలా మంది వారు చేసే ప్రతి వంటకాల్లో బిర్యానీ ఆకులు వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ అతిగా బిర్యానీ ఆకులు తినడం మంచిది కాదంట.

బిర్యానీ ఆకులు కొందరికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, చాలా మందికి ఇవి హానికరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి తెలుసుకుందాం.

అల్సర్ , గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు బిర్యానీ ఆకులు వేసిన వంటకాలు ఎక్కువగా తినకూడదంట. ఇది కడుపులో చికాకు వంటి సమస్యలు కలిగిస్తుందంట.

అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గర్భధారణ సమయంలో అస్సలే బిర్యానీ ఆకులను అతిగా తినకూడదంట ఇది కడుపు నొప్పి, అల్సర్ వంటి సమస్యలకు కారణం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

డయాబెటీస్ ఉన్నవారు కూడా బిర్యానీ ఆకులు అతిగా తీసుకోకూడదంట. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నదంటున్నారు వైద్య నిపుణులు.

అదే విధంగా గుండె సమస్యలు ఉన్నవారికి కూడా బిర్యానీ ఆకులు చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. వీరు అతిగా తీసుకోకూడదంట.

ముఖ్యంగా బిర్యానీ ఆకులు ఎక్కువగా వేసిన ఫుడ్ పిల్లలకు పెట్టడం చాలా హానికరం అంట. ఎందుకంటే వీరి జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండటం వలన ఇది కడుపు నొప్పి వంటి సమస్యలు తీసుకొస్తుందంట.