అండాశయ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు ఇవే!

Samatha

21 August  2025

Credit: Instagram

ప్రస్తుతం చాలా మంది అండాశయ క్యాన్సర్ బారినపడుతున్నారు. అయితే కొంత మందికి దీని లక్షణాలు తెలియక వ్యాధిని గుర్తించ లేకపోతున్నారు.

వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం. అండాశయ క్యాన్సర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం.

పీరియడ్స్ సమయంలో అసాధారణ రక్తస్రావం అండాశ క్యాన్సర్‌ లక్షణాల్లో ఒకటి. సంభోగం తర్వాత రక్త స్రావం కూడా దీని సంకేతమే అంటున్నారు నిపుణులు.

అకస్మాత్తుగా మీ యోనిలో మార్పు గమనించడం లేదా రంగు, వాసన వంటివి ఏర్పడినట్లు అయితే అవి క్యాన్సర్ ప్రారంభ సంకేతాలంట.

ఆకలి మందగించడం, కొంచెం తిన్న తర్వాత కూడా కడుపు నిండుగా అనిపించడం అండాశయ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

భోజనం చేసిన తర్వాత కొద్దిగా లేదా ఎక్కువగా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తితే అది కూడా క్యాన్సర్ లక్షణంలో ఒకటి అంట.

ఎలాంటి కారణం లేకుండా నడుము కింది భాగంలో నిరంతరం నొపపి రావడం, అంతర్గత అవయవాలపై కణితులను సూచిస్తుందంట.

తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం , మలబద్ధక సమస్య, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలంట.